ఇష్టారాజ్యం ప్రభుత్వ కార్యక్రమాలను నీరుగారుస్తున్న అధికారులు..

అధికారుల ఇష్టారాజ్యం ప్రభుత్వ కార్యక్రమాలను నీరుగారుస్తున్న అధికారులు.

మీడియాకు,ప్రజా ప్రతినిధులకు కూడా సమాచారం ఇవ్వడంలో అధికారుల విఫలం..

ఇప్పటికే పలు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు. సమాచారం ఇవ్వని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు..

IMG 20240925 WA0067

ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి సమాచారం అటు ప్రజాప్రతినిధులకు ఇటు మీడియాకు అందడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీవో కార్యాలయంలో, మండలంలో, మున్సిపాలిటీ జరిగే ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఎలాంటి సమాచారం ఉండదు. కార్యక్రమాలన్నీ పూర్తయిపోయిన తర్వాత తూతూ మంత్రంగా సోషల్ మీడియా వేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇందులో బాగానే బుధవారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కార్యక్రమం గురించి తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని మున్సిపల్ చైర్మన్ కే నరేందర్ మున్సిపల్ కమిషనర్, అధికారులపై వాగ్వాదానికి దిగారు. కావాలనే మాకు సమాచారం ఇవ్వడం లేదని చైర్మన్ మరియు కౌన్సిలర్లు కమిషనర్ ను నిలవడం జరిగింది..

Join WhatsApp

Join Now