యదేచ్చగా ప్రభుత్వ భూములనుండి మట్టిని అక్రమ రవాణా..పట్టించుకోని అధికారులు

*యదేచ్చగా ప్రభుత్వ భూములనుండి మట్టిని అక్రమ రవాణా*

*పట్టించుకోని అధికారులు*

*ఇల్లందకుంట మార్చి 3 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామంలో కంచం గోవర్ధన్ అనే వ్యక్తి తనకు గల జెసిబి తో గ్రామ పెద్ద చెరువు పిన్నచెరువు రాయి కుంట మాటుకుంట అనే చెరువులో మట్టిని అక్రమంగా యదేచ్చగా తనకు గల ట్రాక్టర్ల సహాయంతో ఇతర గ్రామాలకు తరలించి అమ్ముకుంటున్నాడు అని అదే గ్రామానికి చెందిన బండి మల్లేష్ పత్రిక ముఖంగా తెలియజేశారు ఎన్నిసార్లు అధికారులకు ఫోన్ చేసిన స్పందించడం లేదని తనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విన్నవించారు గత నాలుగు సంవత్సరాలుగా వివిధ గ్రామాలకు చెరువు మట్టిని విక్రయించడం జరుగుతుందని అయిన అధికారులు చూసి చూడనట్టు ఉంటున్నారని పేర్కొన్నారు గ్రామము లోని చెరువులను సర్వ నాశనం చేస్తున్నాడని గతం లో ఇదే గోవర్దన్ పైన కేసు నమోదు కావడం జరిగిందని ఐనా కూడా ఏ మాత్రం భయం లేకుండ అధికారులకు లంచం ఎర చూపిస్తూ తన మట్టి మాఫియాను మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నాడని దీని వలన మత్య సంపద తగ్గడం జరుగుతుందని అంతే కాకుండ చెరువులో జెసిబి తో లోతైన కందకాలు త్రవ్వడం వలన మూగ జీవాలు,మత్స్య కారులు,పశువుల కాపరులు ప్రమాదాలకు గురయ్యే ఆవకాశం జరుగుతుందని పేర్కొన్నారు ఇకనైనా ఈ మట్టి మాఫీయను అధికారులు అడ్డుకోక పోతే చెరువులు భావి తరాలకు అందకుండా పోయే అవకాశం ఉందని ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెల్లిన ఏ అధికారి స్పందిచడం లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఫిషరీస్ చైర్మన్ బండి మల్లేష్ పేర్కొన్నారు వెంటనే సదురు మట్టి మాఫియా వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు

Join WhatsApp

Join Now