శివ్వంపేట జనవరి 5(ప్రశ్న ఆయుధం న్యూస్ డే): మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గంగాయిపల్లి గ్రామంలో వేలాడుతున్న విద్యుత్ తీగలు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గ్రామంలోని తలారి సురేష్ తన పొలం మీదుగా వెళ్లే విద్యుత్ తీగలు చాలా దిగువగా వేలాడుతున్నాయని, ఈ విషయంగా అనేకసార్లు శివ్వంపేట ఏఈకి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా గ్రామంలోని గంగచెరువు దగ్గర ఉన్న కరెంటు ట్రాన్స్ఫారం మరియు పటేల్ కుంట దగ్గర నుండి రైతులకు వెళ్లే లైన్ కూడా అత్యంత ప్రమాదకరంగా ఉందని రైతులు చెబుతున్నారు. ఈ విషయంపై లైన్ మెన్ ను వివరణ కోరగా, తాను కూడా ఎన్నిసార్లు ఏఈకి చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. ఈ విధంగా అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు ప్రాణాలు పోతూ ప్రాణభయంతో జీవిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
వేలాడుతున్న విద్యుత్ తీగలు పట్టించుకోని అధికారులు
Published On: January 5, 2025 8:06 pm
