అతివేగ లారీ బలిగొన్న వృద్ధుడు

అతివేగ లారీ బలిగొన్న వృద్ధుడు

కామారెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 18 

 

కామారెడ్డి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుడైన మేడిచర్ల జనార్ధన్‌రావు (73) స్కూటీపై ఇంటికి తిరిగి వస్తుండగా వెనుకనుంచి వచ్చిన లారీ అతివేగంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో నేలకూలిన ఆయనను తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతిగా ప్రకటించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ అలీముద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment