ఆంగ్ల ఉపాధ్యాయునికి ఉత్తమ ప్రశంసా పత్ర పురస్కారం
– పాండిచ్చేరిలో ప్రశంసా పత్రాన్ని అందుకున్న ఒల్లాల శ్రీనివాస్
పెద్దపెల్లి జిల్లా ప్రతినిధి, డిసెంబర్-20 ప్రశ్న ఆయుధం: ఆంగ్ల ఉపాధ్యాయునికి ఉత్తమ ప్రశంసాపత్ర పురస్కార అవార్డు దక్కింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మంగపేట గ్రామానికి చెందిన ఒల్లాల శ్రీనివాస్ సుల్తానాబాద్ మండలం సాంబయ్య పల్లి లోని మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో ఆంగ్ల ఉపాధ్యాయినిగా బోధిస్తున్న డాక్టర్ ఒల్లాల శ్రీనివాస్ కు పాండిచ్చేరి రాష్ట్రంలోని పాండిచ్చేరి ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పిమ్స్ వారు ప్రతిసంవత్సరం ప్రదానం చేసె డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ప్రశంసా పత్రం 2024 సంవత్సరానికి గాను పాండిచ్చేరి లో జరిగిన అంతర్జాతీయ సెమినార్ లో ప్రదానం చేసారు. ఒల్లాల శ్రీనివాస్ ఆంగ్లభాషను సులభంగా భోదిస్తూ విద్యార్థుల్లో ఆంగ్లభాష నైపుణ్యాన్ని పెంపొదిస్తూ,విద్యార్థులకు ఆంగ్లభాష పట్ల ఆసక్తిని రేకిత్తిస్తున్నారు.