ఓం శాంతి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్ పర్సన్
ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగష్టు 16, కామారెడ్డి :
ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో శ్రావణమాసం సందర్భంగా అమరనాథ శివలింగ దివ్యదర్శనాన్ని రోటరీ క్లబ్ విద్యానగర్ కామారెడ్డిలో ఏర్పాటు చేశారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున ఉదయం అమర్నాథ శివలింగ పూజ ప్రారంభోత్సవం చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి సతీసమేతంగా వచ్చి అమరనాధుని యొక్క దివ్య దర్శనం చేసుకుని, అమరనాధుని యొక్క కృపకు పాత్రులు అయ్యారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా చేస్తూ అనేకులకు మంచి విషయాలను తెలియచేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఇందుప్రియ కోరారు. అంతేకాకుండా మేము వెళ్లలేని అమరనాధుడి యొక్క దర్శనాన్ని ఇక్కడ చేయించినందుకు చాలా ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ, వనిత రామ్మోహన్, పంపరి లతా శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ సుధాకర్, అనిల్, బ్రహ్మకుమారీలు తదితరులు పాల్గొన్నారు.