ఈనెల 15న మాల , మాల ఉపకులాల ఉద్యోగుల, ఆత్మీయ సమ్మేళనము

  • ఈనెల 15న మాల , మాల ఉపకులాల ఉద్యోగుల, ఆత్మీయ సమ్మేళనము

    ఖమ్మం ఈనెల 15న శుక్రవారం మాల ప్రభుత్వ , ప్రైవేటు , రిటైర్డ్ ఉద్యోగుల , మాల ఉపకులాల , ఆత్మీయ సమ్మేళనం ఖమ్మం మమతా రోడ్డులో గల ఈ ఆర్ ఆర్ (ఒయాసిస్) కన్వెన్షన్ ఏ సి హాలులో జరుగుతుందని ఖమ్మం టీం తెలంగాణ మాల ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఖమ్మం జిల్లా ఇన్చార్జి పల్లా రాజశేఖర్ లాయర్ల సమావేశంలో తెలియజేశారు . కావున ఖమ్మం జిల్లాలో గల మాలలు ఉద్యోగులు ప్రైవేటు రిటైర్డ్ ప్రభుత్వ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉప కులాలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చినారు . ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకటస్వామి , వర్ధన్నపేట పేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు , చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం , సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి , టీం రాష్ట్ర చైర్మన్ దామల్ల సర్వయ్య , కార్యదర్శి మేకల రవీందర్ , సమత సైనిక దళ్ దక్షిణ భారతదేశ ఉపాధ్యక్షులు దిగంబర కాంబ్లీ , ప్రముఖ గాయకులు రేజర్ల రాజేష్ , తెలంగాణ లెక్చరర్ ఫోరం రాష్ట్ర నాయకులు మామిడి నారాయణ , రాష్ట్ర భీమ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మందాల భాస్కర్ , సెంటర్ ఫర్ దళితు స్టడీస్ చైర్ పర్సన్ మల్లేపల్లి లక్ష్మయ్య లు ముఖ్య అతిధులు హాజరవ్వనున్నారు . ఈ కార్యక్రమంలో మాల లాయర్ రెంటాల ఆనంద్ , మర్రి ప్రకాష్ పిడతల రామ్మూర్తి , అనిల్ , అనపర్తి సంజీవరావు , చరణ్ , టీం బాద్యులు జంగం లక్ష్మణరావు , ముత్తమాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now