30న కమలం గూటికి జార్ఖండ్ మాజీ సీఎం?

ఈ నెల 30న కమలం గూటికి జార్ఖండ్ మాజీ సీఎం..?

IMG 20240827 WA0050

జార్ఖండ్ మాజీ ముఖ్య మంత్రి చంపాయ్ సోరెన్ ఎట్టకేలకు తన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించు కున్నారు. చంపై సోరెన్ బీజేపీలో చేరబోతున్నట్లు తెలిసింది.గత కొన్ని రోజులుగా హేమంత్ సోరెన్.. జార్ఖండ్ ముక్తి మోర్చాపై మాజీ సిఎం చంపై సోరెన్ బహిరం గంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లోపు చంపై సోరెన్‌తో కలసి రావడం ద్వారా బిజెపికి మంచి ప్రయోజనం చేకూరనుంది. సోమవారం సాయంత్రం హోంమంత్రి అమిత్ షాతో చంపాయ్ సోరెన్ భేటీ అయ్యారు. ఆయన వెంట అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ కూడా ఉన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్య మంత్రి, మన దేశంలోని ప్రముఖ గిరిజన నేత చంపాయ్ సోరెన్ కొంతకాలం క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని సీఎం హిమంత తెలియజేశారు. ఆగస్టు 30న రాంచీలో చంపాయ్ అధికారికంగా బీజేపీలో చేరనున్నట్లు వెల్లడించారు. కాగా రాజకీ యాల నుంచి తప్పుకోవడం లేదని చంపై సోరెన్ ఇటీవలే చెప్పారు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలంటే రాజకీ యాల్లో ఉండాల్సిన అవ సరం ఉందన్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చంపాయ్ సోరెన్ గతంలో చెప్పారు.భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాం డరింగ్ కేసులో హేమంత్ సోరెన్ అరెస్టయ్యారు. హేమంత్ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత చంపై సోరెన్ జార్ఖండ్ కొత్త సీఎంగా నియమితుల య్యారు.

Join WhatsApp

Join Now