కొత్త సంవత్సరం రోజు లక్ష్మీనరసింహుడి దర్శనానికై బారులు తీరిన జనం
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ శ్రీ లక్ష్మీనరసింహుడి దర్శనానికై జనం వివిధ గ్రామాల, పట్టణాల నుండి ఆలయానికి వచ్చిన భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని పలువురు వాహన పూజలు, ఓడిబియాలు ముక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరములో మాకు ఎలాంటి కరువు కాటకాలు, కష్టాలు రాకూడదని, మేమంతా ఆరోగ్యవంతులగా ఉండాలని మొక్కుకున్నారు.