ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 9 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
ఈనెల 11 న చంద్రుగొండ మండల తాహసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నారు.
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజర్ ఎనగంటి కృపాకర్ చండ్రుగొండ మండలంలో గురువారం ఊరూర చైతన్య యాత్ర చేపట్టారు. ఎస్సీ కులాల ప్రజలు వారి సమస్యలను తాహసిల్దార్ కు నేరుగా తెలుపుకొనటానికి దరఖాస్తులు వ్రాసుకొని అధిక సంఖ్యలో కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతం ఎస్సీ కులాల స్థానిక రిజర్వేషన్ అమలు చేయాలని, హక్కులు,అభివృద్ధి, ఆత్మ గౌరవం కోసం జరిగి పోరాటంలో పార్టీలకు, సంఘాలకు అతీతంగా ఎస్సీ కులాల నాయకులు పాల్గొనాలని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో చంద్రుగొండ మండల మాజీ ఎంపీటీసీ చాపలమడుగు లక్ష్మణరావు,లాలయ్య,కిరణ్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 11న చంద్రుగొండ మండల తాహసిల్దార్ కు ఎస్సీ కులాల సమస్యలపై వినతి
by Naddi Sai
Published On: January 9, 2025 9:28 pm