సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతిని పురస్కరించుకొని. సంగారెడ్డిలోని కలెక్టర్ కార్యాలయం ముందు నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల 18న నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడు నక్క నాగరాజు గౌడ్ తెలిపారు. శనివారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాగరాజు గౌడ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజీఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి, సంగారెడ్డి శాసన సభ్యుడు చింతా ప్రభాకర్, రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం సంగారెడ్డిలో ఆగస్టు 18న (సోమవారం) ఉదయం 9 గంటలకు ఐబీ నుండి బైక్ ర్యాలీ ప్రారంభమై కలెక్టర్ కార్యాలయం ముందు ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం వరకు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అక్కడ 10:30 గంటలకు ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో 375వ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని బహుజనులందరూ, గౌడ సోదరులు, గీత కార్మికులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ ఉత్సవ కమిటీ తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజు గౌడ్, గౌడ పెద్దలు రాములు గౌడ్, హనుమంతు గౌడ్, మల్లాగౌడ్, డాక్టర్ రాజు గౌడ్, డాక్టర్ స్వామి గౌడ్, ప్రభు గౌడ్, లింగాగౌడ్, విట్టల్ గౌడ్, మాజీ జడ్పిటిసి మనోహర్ గౌడ్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణ గౌడ్, గౌడ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేశం గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్న గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్, గౌడ సంఘం నాయకులు వినయ్ గౌడ్, సంగమేశ్వర్ గౌడ్, వెంకటేశం గౌడ్, ప్రభుగౌడ్, కవి రచయిత ఉమ్మన్నగారి కృష్ణగౌడ్, కల్లు గీత కార్మిక సంఘం సంగారెడ్డి మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు కృష్ణాగౌడ్, ప్రధాన కార్యదర్శి హరీష్ గౌడ్, సంగారెడ్డి గౌడ సంఘం నాయకులు శ్రీనివాస్ గౌడ్, హరి శంకర్ గౌడ్, పవన్ గౌడ్, విశ్వం గౌడ్, నరసింహగౌడ్, శివగౌడ్ తదితరులు పాల్గొన్నారు.