28న కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయండి

కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించాలి

 

నాన్ పర్మినెంట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి

 

ఈఎస్ఐ,పిఎఫ్ సౌకర్యం కల్పించాలి

 

28 న కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయండి

 

సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య

 

గజ్వేల్ సెప్టెంబర్ 17 ప్రశ్న ఆయుధం :

 

జిల్లాలో కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించి, నాన్ పర్మినెంట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఈఎస్ఐ పీఎఫ్ చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలని 28న జరుగు చలో కలెక్టరేట్ కార్యాలయం జయప్రదం చేయాలని సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య కార్మికులకు పిలుపునిచ్చారు జగదేవ్పూర్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నుండి ఐదు నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులను పట్టించుకోవడంలేదని అన్నారు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించాలని, కార్మికులందరికీ ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు 20 సంవత్సరాలు దాటిన కార్మికులను పర్మినెంట్ చేయడం లేదని అన్నారు పెరుగుతున్న ధరలతో కార్మికుల కుటుంబాలు తీవ్రమైన ఆందోళన ఎదుర్కొంటున్నయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాలు 26 వేల రూపాయల సవరించకుండా కేవలం బేసిక్ వీడియో కలిపి కనీస వేతనంగా 12 వేల రూపాయలు నిర్ణయించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని విమర్శించారు ప్రభుత్వం కనీస వేతనాల సలహా మండలి లేకుండానే డాక్టర్ అక్ట్రాయిడ్ ఫార్ములా పాటించకుండా, 1952 లో జరిగిన 15వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిర్ణయించిన విధానం లేకుండ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని విమర్శించారు జిల్లాలో పరిశ్రమలు కనీస వేతనాలు అమలు చేయడం లేదని, 12 గంటల పని విధానం అమలు చేస్తూ కార్మికులను పాల్పడుతుందని చట్టబద్ధ సౌకర్యాలు అమలు పరుచడం లేదని అన్నారు. పరిశ్రమ యజమాన్యాలు తీవ్రమైన శ్రమ దోపిడీకి పాల్పడడం జరుగుతుందని అన్నారు 28 న జరిగే కలెక్టరేట్ ముట్టడిలో కార్మికులను పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నర్సింలు యాదగిరి బిక్షపతి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now