దీపావళి పండగ సందర్భంగా అగ్నిమాపక జిల్లా అధికారి ఆధ్వర్యంలో ప్రజలకు పలు సూచనలు..

దీపావళి పండగ సందర్భంగా అగ్నిమాపక జిల్లా అధికారి ఆధ్వర్యంలో ప్రజలకు పలు సూచనలు..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 30:

కామారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.మొదటగా జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. కామారెడ్డి ప్రజలు దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో పలు జాగ్రత్తలను సూచనలను పాటించాలని తెలియజేశారు. టపాసులు కొనే సమయంలో నాణ్యత గల టపాకాయలను మాత్రమే ప్రజలు కొనుగోలు చేయాలని సూచించారు. మరియు లైసెన్స్ దారుల వద్ద నుండి కొనుగోలు చేయాలని టపాసులు ప్రజల మధ్యలో కాకుండా కాళీ స్థలములో మాత్రమే టపాసులు కాల్చాలని సూచించారు. టపాసులు కాల్చేటప్పుడు ముందుగా చిన్న పీల్లలు జాగ్రత్తలు పాటించాలని బకెట్లో నీటిని దగ్గర ఉంచుకొని టపాసులు కాల్చాలని తప్పనిసరిగా కాటన్ దుస్తులు ధరించాలని కుటుంబ పెద్దల సమక్షంలో పిల్లలు టపాసులు కాల్చాలని తెలియజేశారు. పిల్లలు జాగ్రత్తలు ఒకసారి కాల్చిన టపాసులు మళ్లీ కాల్చకూడదని టపాసులు ఒకదాని తర్వాత ఒకటి కాల్చాలని టపాసులు కాల్చేటప్పుడు సురక్షితంగా దూరం పాటించగలరని తెలియజేశారు. ఇంటిలోపట టపాసులు కాల్చకూడదని మండే స్వభావం గల పదార్థాల వద్ద టపాసులు కాల్చవద్దని పేలని టపాసులు మళ్లీ కాల్చకూడదని ఒకవేళ టపాసులు కాల్చేటప్పుడు ఏదైనా సంభవాలు జరిగితే వెంటనే సంబంధిత ఆస్పత్రిని సందర్శించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ మహమ్మద్ అలీ అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now