పద్మ విభూషణ్ రామోజీరావు జయంతి సందర్భంగా ప్రజా ఆలోచన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంస్మరణ సభ
ప్రశ్న ఆయుధం నవంబర్ 17: కూకట్‌పల్లి ప్రతినిధి
తెలుగు జర్నలిజానికి అత్యంత వన్నె తీసుకొచ్చిన మహోన్నత జర్నలిజం హింది శిఖరం పద్మ విభూషణ్ రామోజీరావు అని పిఎసి చైర్మన్ ఆరికపూడి గాంధీ అన్నారు. పద్మ విభూషణ్ రామోజీరావు జయంతి సందర్భంగా ప్రజా ఆలోచన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంస్మరణ శుభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సంస్మరణ సభ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రజా ఆలోచన వేదిక అధ్యక్షులు విద్య వెంకట్ మాట్లాడుతూ సమాజంలో సామాజిక స్పృహను పెంపొందించేందుకు అసమానతలను తొలగించేందుకు ప్రజా ఆలోచన వేదిక పనిచేస్తుందన్నారు. తెలుగు జర్నలిజం అక్షర దిగ్గజం రామోజీరావు జయంతి సందర్భంగా నిర్వహించిన సంస్కరణ సభ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు కృతజ్ఞతలు తెలిపారు. గాంధీ మాట్లాడుతూ రామోజీరావు భారతదేశంలోనే అతిపెద్ద ఫిలిం సిటీ నిర్మించడం సాహసం అని చెప్పక తప్పదు అన్నారు. వేల కోట్ల వాళ్లు కూడా సాహసం చేయలేదు సాహసం ఆయన నైజం అని అన్నారు. రామోజీరావును చూసి నేర్చుకున్న తాను రాజకీయాల్లో నీతి నిజాయితీగానే కొనసాగుతానన్నారు. ఏపీ బీజేపీ సీనియర్ నాయకులు కిలారు దిలీప్ కుమార్ మాట్లాడుతూ పద్మ విభూషణ్
రామోజీ రావు సమయానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చేవారని, ఇతరుల సమయం వృధా చేయరాదని సూచించే వారన్నారు. సూర్యున్ని అత్యంత శక్తివంతంగా నమ్మేవారు, రామోజీరావు
ఆయన దేవుని నమ్మకపోయినా ఆయన అదృష్టం కాలం కలిసి వచ్చిందని అన్నారు. ఈనాడు సంస్థలు ఆయన కష్టం ఇవన్నీతోపాటు అందరిని ప్రేమగా చూసుకోవడం ఆయన నేపథ్యం అన్నారు. పనియే నా ఎంజాయ్ మెంట్ అనే రామోజీరావు లేని లోటు తీర్చలేమన్నారు. జనసేన సీనియర్ నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మాట్లాడుతూ ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తారు, సమయానికి నీ బద్దులు రామోజీరావు అని కొనియాడారు. ఆయన ఈనాడు పత్రిక తో పాటు ఇతర రంగాల్లో ప్రవేశించి తెలుగువారి కీర్తి ప్రతిష్టతలను ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన అన్నారు. బిజెపి సీనియర్ నాయకులు షేక్ షాజహాన్ మాట్లాడుతూ రామోజీరావు కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా నిస్వార్ధంగా సమాజానికి సేవలు అందించారని గుర్తు చేశారు. బిజెపి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చెన్నమనేని స్రవంతి మాట్లాడుతూ ఈనాడు పత్రిక ప్రారంభించే కంటే ముందు వరకు వార్తలు అంటే జాతీయ, రాష్ట్రస్థాయిలో జరిగే వివరాలే ప్రచురించే వారిని ఈనాడు ప్రారంభమైన తర్వాత మారుమూల కుగ్రామం నుండి సమాచారాన్ని సేకరించి సమగ్ర సమాచారాన్ని అందించిన ఘనత ఈనాడుకే దక్కుతుందని అది ప్రారంభించిన రామోజీరావు జర్నలిజానికి దిక్సూచి అని కొనియాడారు. అవని స్వచ్చంద సంస్థ అధ్యక్షురాలు సత్తూర్ శిరీష మాట్లాడుతూ రామోజీరావు నేపథ్యం ఎందరికో స్ఫూర్తిదాయకం అలాంటి పెద్ద పర్సనాలిటీ సంస్మరణ సభలో మాట్లాడడమంటే అదృష్టంగా భావించవచ్చు అన్నారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి రవీందర్ రావు, వివేకానంద నగర్ క్లబ్ అధ్యక్షులు మేకా శివరాం ప్రసాద్ లు ప్రసంగించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంబాల మహేష్ గౌడ్, టిడిపి సీనియర్ నాయకులు కంకణాల వెంకట సుబ్బయ్య, జనసేన నాయకులు కొల్లా శంకర్, జర్నలిస్టులు సముద్రాల జగదీశ్వర్ గుప్తా, కోహిర్ నాగరాజ్ యాదవ్, కళ్యాణ్, సముద్రాల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.