మరోసారి పట్టుబడ్డ విదేశీ గంజాయి?

*మరోసారి పట్టుబడ్డ విదేశీ గంజాయి?*

హైదరాబాద్:జనవరి 27

హైదరాబాద్ లో మరోసారి విదేశీ గంజాయి కలకలం రేపింది. గచ్చిబౌలీలోని ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ దగ్గర ఆదివారం రాత్రి గంజాయి విక్రయిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.

అతని దగ్గరి నుంచి 170 గ్రాముల విదేశీ గంజాయి, కిలో లోకల్ గంజాయి, బైకు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుడు బెంగళూరు లోని డెలాయిట్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శివరామ్ గా గుర్తించారు.

అమెరికాలోని కాలిఫోర్ని యా నుంచి గంజాయిని హైదరాబాద్ కు అక్రమంగా తీసుకువచ్చి అమ్ముతు న్నట్లు గుర్తించారు పోలీసులు. మరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అజయ్ తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారని తెలిపారు. ఇద్ద రూ కలిసి ప్రతీవారంతంలో గంజాయి బిజినెస్ చేస్తు న్నారని తెలిపారు. లోకల్ గంజాయిని బెంగళూరులో కొనుగోలు చేసి ప్రైవేట్ బస్సుల్లో హైదరాబాద్ కు సరఫరా చేస్తున్నారని తెలిపారు.

సినిమావాళ్లకు కూడా విదేశీ గంజాయి సరఫరా చేసినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎవరెవరికీ సరఫరా చేస్తున్నారన్న విషయంపై కూపీ లాగుతున్నారు

Join WhatsApp

Join Now