అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య..
నిజామాబాద్ జనవరి 16
అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని ఐదో టౌన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారంలోని వడ్డెర కాలనీలో నివాసముండే మక్కల లక్ష్మణ్ అప్పుల కారణంగా మద్యానికి బానిసయ్యాడు. అప్పుల బాధలు తట్టుకోలేక మనస్థాపంతో గురువారం ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు