సామాన్యులకు ఒక న్యాయం సంపన్నులకు ఇంకో న్యాయమా

IMG 20240912 WA2115

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో సామాన్యులకు ఒక న్యాయం సంపన్నులకు ఇంకో న్యాయం అన్నట్లుగా మున్సిపల్ అధికారుల వ్యవహారశైలి ఉందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ మండిపడ్డారు.గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా 30వ వార్డు మథురబస్తీలో అనుమతులు లేకుండా చేస్తున్న అక్రమ సెల్లార్ నిర్మాణం విషయంలో తమ పార్టీ ఆధ్వర్యంలో గత నాలుగు నెలలుగా అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా తూతూమంత్రంగా నోటీసులు జారీ చేయడం తప్ప చర్యలు తీసుకున్న పాపాన పోలేదని విమర్శించారు.తదుపరి చర్యల కోసం టాస్క్ ఫోర్స్ కమిటీకి లేఖరాసి చేతులు దులుపుకున్నారని ఇది సరైన పద్ధతి కాదన్నారు.కావాలని జాప్యం చేస్తూ పరోక్షంగా అక్రమ నిర్మాణం చేపడుతున్న వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు.జాతీయ రహదారిపై ఇసుక,కంకర పోసి పాదచారులు,వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై,అధికారుల వ్యవహారశైలి పట్ల స్థానిక ఎంఎల్ఏ సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.అధికారుల తీరుకు నిరసనగా త్వరలో మున్సిపల్ కార్యాలయం ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,సమీర్,నిఖిల్,మురళి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now