తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

*తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి*

జిల్లా..నకరికల్లు – అద్దంకి నార్కెట్ పల్లి రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో పాత కంప్యూటర్ల సామానులతో హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ లారీ ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరిని స్థానిక వైద్యశాలకు తరలించారు.

ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంఘటన స్థలానికి చేరుకున్న నకరికల్లు ఎస్సై సురేష్

ఈ ప్రమాదం లో మరణించిన వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్ మస్తాన్ గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు

ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పటల్ కి తరలించారు….

Join WhatsApp

Join Now