Site icon PRASHNA AYUDHAM

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి..

IMG 20250202 WA0092

*రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి..*

నిజామాబాద్ ఫిబ్రవరి 02

కంటైనర్​ మీద నుంచి వెళ్లడంతో ఒకరు మృతి చెందిన ఘటన ఇందల్వాయి మండలం చంద్రాయన్​పల్లి శివారులో ఆదివారం చోటు చేసుకుంది. మెదక్ జిల్లాకు చెందిన బత్తుల నాగరాజు (32) ఆదివారం ఉదయం తన బైక్​పై కామారెడ్డి వైపు నుంచి నిజామాబాద్​ వెళ్తున్నాడు. అయితే చంద్రాయన్​పల్లి వద్ద సర్వీస్​ రోడ్డు పనులు జరుగుతుండడంతో రోడ్డు పక్కన మట్టి బ్యాగులు అడ్డంగా పెట్టారు. వాటిని ఢీకొని నాగరాజు కింద పడగా ఆయనపై నుంచి కంటైనర్​ వెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై మనోజ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Exit mobile version