*ఆటో ను డికొన్న బైక్ ఒకరు మృతి*
ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ ప్రతినిధి జనవరి-15
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లోని మద్దెల్చేర్
గ్రామానికి చెందిన మంగలి శ్రీనివాస్ సన్నాఫ్ గంగారం, వయసు 35 సంవత్సరాలు, కులం మంగలి మరియు అతని బావ అయినా పురుషోత్తం వీరిద్దరూ బైక్ పై
(నెంబర్: Ap25AJ1570) బాచిపల్లి నుండి మద్దెల చెరువు వెళుతుండగా మార్గమధ్యలో 14-01-2025 నాడు రాత్రి 10 గంటల సమయంలో పిట్లం టూ బాన్సువాడ రోడ్డు లోని సిద్ధదాపూర్ శివారు లో పురుషోత్తం తన యొక్క బైక్ ను అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆటోకు గుద్దుకొనగ బైక్ వెనకాల కూర్చున్న శ్రీనివాస్ రోడ్డు మీద పడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించినాడు. ఇట్టి సమాచారం తెలిసిన వెంటనే స్థానిక పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని మృతి ని భార్య అయిన మంగలి గంగమని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని బాన్స్వాడ ఏరియా హాస్పెటల్ కి తర్లించడం జరిగింది.మృతునికి ఒక కొడుకు కలడు అని. ఎస్సై రాజు తెలిపారు.