విజయవాడలో విరిగిపడ్డ కొండచరియలు..ఒకరు మృతి
విజయవాడలో ఉదయం నుండి వర్షబీ భత్సం కొనసాగుతోంది. భారీ వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. సున్నపుబట్టి సెంటర్‌లో కొండచరియలు విరిగిపడి ఓ ఇల్లు ధ్వంసం అయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా… మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఇంట్లో చిక్కుకున్న ఇద్దరిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతు న్నాయి. ఘటన స్థలానికి వెళ్లి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఇటు సితార సెంటర్‌లో రిటైనింగ్ వాల్ విరిగిపడింది.