గణనాథని లడ్డు కైవసం చేసుకున్న ఒగ్గు వెంకటేష్.

1లక్ష 21 వేల వేలంపాట పాడి గణనాథని లడ్డు కైవసం చేసుకున్న ఒగ్గు వెంకటేష్.

IMG 20240911 WA0049

 

గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాజా వీధిలో శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయం నందు పద్మశాలీలు వినాయక చవితి సందర్భంగా గజేంద్ర స్వామిని ప్రతిష్టించి ఘనంగా పూజలు నిర్వహించారు.వేదమంత్రోత్సవంతో బ్రాహ్మణులచే ఐదు రోజులు ఘనంగా పూజలు నిర్వహించబడ్డ ,వినాయకుని లడ్డూ వేలం పాట సమస్త పద్మశాలి కుల బంధువుల మధ్య పోటాపోటీగా లడ్డు వేలం నిర్వహించారు. ఈ పోటీలో పద్మశాలి ఒగ్గు వెంకటేష్ పాట పాడి విఘ్నేశ్వరుని లడ్డు ఈసారి కూడా కైవసం చేసుకున్నాడు. గత సంవత్సరం వినాయక లడ్డు ఒక లక్ష 30 వేలకు వేలం పాట పాడి ఒగ్గు వెంకటేష్ కైవసం చేసుకోగా, ఈ సంవత్సరం 2024 లో ఈసారి కూడా ఆయనే 1లక్ష 21 వేల వేలంపాట పాడి గణనాథని లడ్డు కైవసం చేసుకున్నారు. పద్మశాలి జిల్లా సంఘం మరియు జిల్లా యువజన సంఘం పద్మశాలి సేవా సంఘం, పద్మశాలి యువజన సంఘం ,నుంచి నిర్వహించబడ్డ లడ్డూ వేలం పాటలో కైవసం చేసుకున్న భక్తునికి బ్రాహ్మణులచే మరియు పద్మశాలి కుల సంఘాల నాయకులు నామాల శ్రీకాంత్,చిలివేరి సాయిబాబా, అక్కల కుమార్,బిజ్జి లక్ష్మీనారాయణ తదితరులు భక్తునికి శాలువాలతో సన్మానం చేసి లడ్డుని అందజేశారు. వీరి కుటుంబానికి అన్ని విధాలుగా ఆ భగవంతుడు తోడుగా ఉండి, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో, ఉండాలని వినాయకుని ప్రార్థిస్తూ ఆయనకు లడ్డూను అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి కుల బంధువులు అందరూ పాల్గొని విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now