కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి రైతు ఆర్తనాదాలు

కర్నూలు మార్కెట్ యార్డ్ లో ఉల్లి రైతు ఆర్తనాదాలు

కేజీ ఒక్క రూపాయికి పడిపోయిన దుస్థితి

వారం రోజుల నుంచి కొనే దిక్కు లేక మార్కెట్ యార్డ్ లో వేచి చూస్తున్న రైతులు

యార్డును సందర్శించి రైతులకు ధైర్యం చెప్పిన కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల భరత్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్లు సురేందర్ రెడ్డి

కష్టపడి పండించిన పంట అమ్మితే కనీసం ఆటో బాడిగలకు రాలేదని వాపోయిన రైతులు, ఒక ఎకరా ఉల్లిని పండించడానికి లక్ష నుండి 1,30,000 ఖర్చు అవుతుందని కానీ పంట 50 నుంచి 70 క్వింటాలు వచ్చినా మార్కెట్లో క్వింటాల్ 100 నుంచి 300 మాత్రమే ధర పలుకుతుందని ఈ విధంగా అయితే ఒక ఎకరాకు 20 నుంచి 30 వేలు మాత్రమే చేతికొస్తాయని రైతులు కన్నీరు మున్నీరయ్యారు..జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉల్లి ధర తగ్గితే ప్రభుత్వం కొనుగోలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు బజార్ల ద్వారా విక్రయించి రైతులను ఆదుకుందని కానీ కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని వాపోయారు. ఒకవైపు ఎరువులు లేక పురుగుమందుల ధరలు పెరిగి ఎంతో కష్టపడి పంట పండిస్తే కనీసం కూలీ ఖర్చులకు చెల్లించలేని దుస్థితి

Join WhatsApp

Join Now