Site icon PRASHNA AYUDHAM

పోలీస్ ఫ్లాగ్ డే”ను పురస్కరించుకొని విద్యార్ధిని, విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

IMG 20251013 190623

Oplus_131072

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన ధైర్యవంతులైన పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం/ “పోలీస్ ఫ్లాగ్ డే” నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలను చేపడ్డం జరుగుతుందని, ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా విద్యార్థిని, విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా వ్యాసరచన పోటీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున ఆసక్తి గల వారు ఈ ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలలో పాల్గొనాలని సూచించారు. ఈ పోటీలు మూడు భాషల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో, 6వ తరగతి నుండి పోస్టు గ్రాడ్యుయేషన్ చదివే విద్యార్థులు పాల్గొనడానికి అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు తమ వ్యాసాలను రాసి, అక్టోబర్ 31వ తేదీ లోగా ఆన్లైన్ లో సబ్మిట్ చేయవలసి ఉంటుందని, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 1వ, 2వ, 3వ స్థానాల్లో నిలిచిన విజేతలకు బహుమతులు ఇవ్వడంతో పాటు, రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.

Exit mobile version