ఉన్నత విద్య,జాబ్స్ కోసం విదేశాలకు వెళ్లిన తల్లిదండ్రులను.
సిఐడి పేరట భయబ్రాంతులకు గురిచేసున్న ఆన్లైన్ కేటుగాళ్ళు..
వాట్సప్ కాల్స్ తో కాల్స్ చేస్తూ బడాబాబులను భయబ్రాంతులకు గురిచేస్తూ డబ్బులు వసూలు..
ఓ అమ్మాయికి మీ అబ్బాయి ఆక్సిడెంట్ చేసారని తల్లిదండ్రులను ఫోన..
రెండు రోజుల నుంచి రూ లక్షకు పైగా వసూలు చేసిన అన్లైన్ కేటుగాళ్ళు..
అకౌంట్లో వేయకుంటే షూట్ చేస్తామని బెదిరింపులు.
లబోదిబోమంటు భాదితుడు పోలీస్ స్టేషన్లో పిర్యాదు
వాట్సప్ కాల్స్ డి.పి.పై (సిఐడి) అధికారి, ఫోటో మరియు ఉన్నత పోలీస్ అధికారులు ఫోటో తో కాల్స్ చేసు మోసం చేస్తున్న కేటుగాళ్ళు
పాలకుర్తి మండల కేంద్రమలో గత రెండు రోజులుగా విదేశాలకు ఉన్నత విద్య కోసం, జాబ్స్ కోసం వెళ్లిన వారి డేటా సేకరించి వారి తల్లి తండ్రులకు వాట్సప్ కాల్స్ చేస్తూ మీ పిల్లలు డ్రగ్స్, మరియు, గంజాయి, రేవ్ పార్టీలో, ఆక్సిడెంట్ కేసులో చిక్కుకున్నారని వారిని అదుపులోకి తీసుకున్నామని మాకు కొంత అమౌంట్ అకౌంట్ లో వేస్తే వారిని తప్పిస్తామని నమ్మబలికి వారి అకౌంట్లో డబ్బులు లక్షలకు లక్షలు వేయించుకోగా అసలు విషయం తెలుసుకుందమని వారి పిల్లలకు ఫోన్ చేస్తే మేము బాగానే ఉన్నాము అని తల్లిదండ్రులకు తెలుపగా మోస పోయామని బాధితులు పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు.బాధితుడు నంగునూరి సోమన్న మాట్లాడుతూ మా అబ్బాయి ఉన్నత చదువుల కోసం విదేశాలకు కొద్దీ రోజుల క్రితం వెళ్లగా ఆదివారం ఆగస్టు 18 వ తేదీన నాకు +92347 5493616 డిపి పై (సిఐడి) అనే నెంబర్ నుండి చాలా సార్లు వాట్సఫ్ కాల్స్ వస్తుంటే ఎవరని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడగా నేను సిఐడి అఫిసర్ ను మాట్లాడుతున్నని మీ అబ్బాయి ఒక అమ్మాయికి ఆక్సిడెంట్ చేసారని మా అబ్బాయి ఏడ్చినట్టు బాధపడుతు మాట్లాడినట్టు రికార్డు వినిపియగా అతన్ని ఆ కేసు నుండి తప్పియలంటే వెంటనే మా అకౌంట్ లో డబ్బులు వేయాలని లేకుంటే మీ అబ్బయిని షూట్ చేస్తామని చెప్పగా అబ్బాయి తల్లిదండ్రులు ఈ రోజు ఆదివారం నా అకౌంట్ లో రూ 28వేలు ఉన్నాయని బ్యాంకులు కూడా బంధు ఉన్నాయని చెప్పిన కూడా ససేమిరా అనడంతో మా స్నేహితులు, బంధువులకు కాల్స్ చేసి నా ఫోన్ పే లో డబ్బులు వేయించుకుని అతని నెంబర్ కు మిగతా రూ 80వేలు పంపించమని మొత్తం ఒక లక్ష రూపాయలు వేయగా మళ్ళీ ఫోన్ చేసి ఇంకో లక్ష రూపాయలు వేయమని అనడంతో మా అబ్బాయి కి వెంటనే కాల్ చేసి మాట్లాడగా తను నేను బాగానే ఉన్నానని కొద్దీ రోజుల క్రితం మా స్నేహితులకు కూడా ఇలాగే కాల్స్ చేసి డబ్బులు చేస్తున్నారని అనడంతో మోస పోయామని తెలుసుకుని వెంటనే స్థానిక పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశానని తెలిపారు.