గుండ్లపోచంపల్లిలో ఆరోగ్య భారత్ హాస్పిటల్ ప్రారంభం
నిత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా విస్తరణ – ఎంపీ ఈటల రాజేందర్
గుండ్లపోచంపల్లిలో నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హాస్పిటల్ ప్రారంభం
ప్రారంభోత్సవానికి హాజరైన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
పేదవారికి చవకధరల్లో వైద్యం అందించాలనే లక్ష్యంతో ట్రస్ట్ సేవలు
23 ఏళ్లుగా ఆరోగ్య రంగంలో సేవలందిస్తున్న డాక్టర్ రఘు, డాక్టర్ ప్రతిష్ బృందం
“పేదలకు సౌకర్యవంతమైన వైద్యం అందించడమే లక్ష్యం” — ఈటల
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, అక్టోబర్ 13:
గుండ్లపోచంపల్లిలో నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య భారత్ హాస్పిటల్‌ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్ స్థాపన శుభపరిణామం. పేదవారికి కూడా తక్కువ ధరలో సేవలు అందించాలనే లక్ష్యంతో నిత్యసాయి ట్రస్ట్ 23 సంవత్సరాలుగా కృషి చేస్తోంది. ఈ ఆస్పత్రి కూడా అదే ధ్యేయంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.
ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు, డాక్టర్ ప్రతిష్ తదితరులు పాల్గొన్నారు.