“బంక్యూట్ హాల్ ప్రారంభం”
ప్రశ్న ఆయుధం డిసెంబర్ 26: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్పల్లి నియోజకవర్గం 121 డివిజన్ కూకట్పల్లి లోని బాలకృష్ణ నగర్ లో “వృద్ధి బంక్యూట్” హాల్ ప్రారంభం లో పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ మరియు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర్ రావు పూజ కార్యక్రమంలో పాల్గొని “వృద్ధి బంక్యూట్” నిర్వాహకులు గొట్టిముక్కల గౌతమ్, గుత్తికొండ శంకర్ రావు, గుత్తికొండ మురళి లకు అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ నేటి యువత ప్రభుత్వం పై ప్రభుత్వ ఉద్యోగాల పై ఆదార పడకుండా స్వయం ఉపాధిని పెంపొందించుకోవాలని అన్నారు.