Site icon PRASHNA AYUDHAM

కామారెడ్డిలో ‘డ్రీమ్జ్ కార్ డిటేలింగ్ స్టూడియో’ ప్రారంభం

IMG 20251226 084528

కామారెడ్డిలో ‘డ్రీమ్జ్ కార్ డిటేలింగ్ స్టూడియో’ ప్రారంభం

ముఖ్య అతిథిగా పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

కామారెడ్డి, జిల్లా ప్రతినిధి,ప్రశ్న ఆయుధం డిసెంబర్‌ 25:

కామారెడ్డి పట్టణంలోని గురు రాఘవేంద్ర కాలనీ, పాత రాజంపేట రోడ్డులో ఏర్పాటు చేసిన నూతన డ్రీమ్జ్ కార్ డిటేలింగ్ స్టూడియో సెంటర్ను గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాజా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ రిబ్బన్ కట్ చేసి స్టూడియోను ప్రారంభించారు. ఈ సందర్భంగా గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతతో కార్ల శుభ్రత, డిటేలింగ్ సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. యువత ఇటువంటి వ్యాపారాలతో స్వయం ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, శంకర్ రావు, గడ్డమీది మహేష్, రంగా రమేష్ గౌడ్, సేవాదళ్ అధ్యక్షులు మహేష్, అలాగే బండారి శ్రీకాంత్, పండు శ్రీకాంత్ తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. స్టూడియో ద్వారా పట్టణ ప్రజలకు నాణ్యమైన కార్ డిటేలింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని వారు పేర్కొన్నారు.

Exit mobile version