తెలంగాణలో ఆపరేషన్ ముస్కాన్
తెలంగాణ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ మంచి ఫలితాలను ఇస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న బాల కార్మికులను రక్షించిన పోలీసులు వారి కుటుం బాలకు అప్పగించారు. ముస్కాన్ ఆపరేషన్ గురించి వివరాలు శుక్రవారం ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారుసిన్హా, మీడియాకు తెలిపారు.
ఈ ఆపరేషన్ లో 7,678 మంది చిన్నారులను రక్షించారు.వారిని తల్లి దండ్రులకు అప్పగించినట్టు చారుసిన్హా తెలిపారు. అందులో 7,149 మంది బాలురు, 529 మంది బాలికల ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు రక్షించిన వారిలో ఎక్కువగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు.
ఈ రెండు రాష్ట్రాల నుంచే 3,783 చిన్నారులు ఉన్నా రు. నలుగురు చిన్నారులు నేపాల్‌కు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు రక్షించిన వారిలో 6,718 మంది బాలకార్మిలుగా పనిచేస్తున్నారు. స్ట్రీట్ చిల్డ్రన్స్ 357, భిక్షాటన చేస్తున్న వారు 42 మంది ఉన్నట్లు తెలిపారు. ఇతర పనులలో 559 మంది ఉన్నట్లు గుర్తించారు.
పిల్లలను బాల కార్మికులుగా మార్చుతున్న నిందితులపై 1,713 కేసులు పెట్టామని చారుసిన్హా తెలిపారు. వారిలో1,718 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కాపాడిన పిల్లలలో 6,593 మంది పిల్లలను వారి కుటుంబాలకు అప్పగించారు.
1,049 మంది చిన్నారు లను రెస్క్యూ హోంకు తరలించారు. ఈ ఆపరేషన్‌ను ఒకే నెలలో జులై 1 నుండి 31 వరకు పోలీస్ శాఖ, ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్,చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్,రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ విభాగాలు సంయు క్తంగా నిర్వహించాయని పోలీసులు తెలిపారు.