ఆర్డినెన్స్ ఆలస్యమేనా…
సిద్దిపేట ఆగస్టు 7 ప్రశ్నా ఆయుధం :
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో ఎం ఆర్ పి ఎస్ నాయకులు మచ్చ బాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన సమాజిక న్యాయ తీర్పును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో వర్గీకరణ వెంటనే చేస్తామని అన్నారు కానీ అసెంబ్లీలో ఎటువంటి బిల్లు ఆమోదం చేయకుండానే అసెంబ్లీ సమావేశాలు ముగించారు. ప్రభుత్వ పని తీరు ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా వర్గీకరణ బిల్లు గవర్నర్ కి పంపి వెంటనే ఆర్డినెన్సు తీసుకవచ్చిరాష్ట్రంలో జరుగుతున్నటు వంటి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, పీజీ అడ్మిషన్లు, గ్రూప్ 1,డీఎస్సీ , గ్రూప్ 2 ,గ్రూప్ 3 పరీక్షలలో రిజర్వేషన్ అమలు జరిగేలా మాదిగలకు సామాజిక న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్య మంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు.