హిందూ ధర్మం, దేశ ధర్మంపై శిశుమందిర్ విద్యార్ధులకు దిశా నిర్దేశం
కోరుట్ల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో శనివారం విద్యార్థులకు హిందూ ధర్మం, దేశ ధర్మం పట్ల ఎలాంటి భూమిక వహించాలో విద్యార్థిని విద్యార్థులకు జగిత్యాల హిందూత్వ వాహిని ప్రాంత సంప్రదాయ టోలి సభ్యులు వేముల సంతోష్ దిశా నిర్దేశం చేశారు. భవిష్యత్తులో యువత సమాజంలో దేశ ధర్మం కోసం పోరాడే విధంగా ఎందరో మహానీయుల చరిత్రను విద్యార్థులకు వివరించారు. అమ్మాయిలు అబ్బాయిలు విద్యతో పాటు సంస్కారం నేర్చుకుంటూ శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థిని విద్యార్థులు బయట ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడా చెడు మార్గంలో ప్రయాణించినా వారికి మంచి దిశా నిర్దేశం కలిగేలా సంస్కృతి సాంప్రదాయాలు చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉందని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపు వెంకటేష్, కరస్పాండెంట్ నీలి శ్రీనివాస్, ప్రబంధకారిని కార్యదర్శి వనపర్తి చంద్రమోహన్, అధ్యాపక బృందం పాల్గోన్నారు.