*ప్రజా పాలన పై ఓర్వలేకే అసత్య ఆరోపణలు*
*కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పరశురాం రావు*
*జమ్మికుంట మే 2 ప్రశ్న ఆయుధం*
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో కమిటీ ద్వారా ఇంటి ఎంపిక చేస్తున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలు అయినా టిఆర్ఎస్ బిజెపి వాళ్లు ప్రజా పాలన ను ఓర్వలేకే ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షుడు పరశురాం రావు అన్నారు పదేళ్ల పాలనలో అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వారు ఇచ్చిన వాగ్దానాలు మరిచి ఎన్నికల్లో మాత్రమే హామీలను వాడుకొని వాటికి ఎగనామం పెట్టేశారని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మోడీ ,డబుల్ బెడ్ రూమ్ పథకం కింద కేసీఆర్ ప్రజలకి ఏనాడు న్యాయం చేయలేదని ఈరోజు ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం జరగడం వారికి ఏమాత్రం మింగుడు పడటం లేదని అలా ఓర్వలేకే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రజలను మభ్యపెట్టి వారిని మోసం చేయడానికి చూస్తున్నారని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన ధ్యేయం ప్రతి లబ్దిదారులకి లబ్ధి పొందడం అని ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఎలాంటి అవకతవకలు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ప్రక్రియ కొనసాగుతుందని తెలియజేస్తూ,మా ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకి వాటి ఫలాలు అందుతాయని మా నాయకులు, కార్యకర్తలు అందరూ ఎలాంటి తప్పులు చేయరని ఇలాంటి నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలని ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి బిజెపి,బిఆర్ఎస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ధీటుగా హెచ్చరిస్తున్నానని అన్నారు