‘ఆ విషయంలో జగన్‌కు ఆస్కార్ ఇవ్వొచ్చు’ – మంత్రి నిమ్మల రామానాయుడు
జగన్ పై ఘాటు వ్యాఖ్యలు: అబద్ధాల్లో ఆస్కార్ అర్హుడు!
పోలవరం ఎత్తుపై దుష్ప్రచారం చేస్తున్న జగన్ – నిమ్మల రామానాయుడు మండిపాటు
ఆంధ్రప్రదేశ్ డెస్క్ ప్రశ్న ఆయుధం నవంబర్ 01:
ఆ విషయంలో జగన్‌కు ఆస్కార్ ఇవ్వొచ్చు’తల్లిని, చెల్లిని మోసం చేసిన జగన్ లాంటి దౌర్భాగ్య రాజకీయ నాయకుడు ఎక్కడా కనిపించరని మంత్రి నిమ్మల రామానాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదన్నారు. పోలవరం ఎత్తుపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాల్లో జగన్‌కు ఆస్కార్ ఇవ్వొచ్చన్నారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు జగనే తగ్గించారని, దీని కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా కోరారన్నారు.