పొట్టి శ్రీరాములు పేరు మార్చాలనే నిర్ణయాన్ని పున పరిశీలించాలి.
-అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పేరు మార్చా లనే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పున పరిశీలించాలని అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ కోరారు. ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలనీ తెలిపారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కింద మంత్రిమండలి సమావేశంలో తీర్మా నించిన అంశాలలో మహిళా యూనివర్సి టీకి చాకలి ఐలమ్మ పేరు, హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ గారి పేర్లు పెట్ట డంపై స్వాగతిస్తున్నామని అన్నారు. కానీ తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చే పొట్టిశ్రీరాములు పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పున రాలోచన చేయా లనీ సూచించారు.
పొట్టి శ్రీరాములు పేరును మార్చడం సమంజసం కాదని అన్నారు.పొట్టి శ్రీరా ములు ఏ ప్రాంతానికో… రాష్ట్రానికో చెంది నవారు కాదని గుర్తించాలన్నారు. ఆయన దేశం గర్వించ దగ్గ నాయకుడు అన్నారు. స్వా తంత్ర్య ఉద్యమంలో పాల్గొని గాంధీ జీ ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. అలాంటి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం తెలుగు విశ్వ విద్యాలయానికి ఆ పేరు పెట్టారని, కానీ ఇప్పుడు మార్చడం సరికాదన్నారు. తెలుగు విశ్వవిద్యా లయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టి గౌరవించు కోవడాన్ని తాము స్వా గతిస్తున్నామని, అయితే ఆయనను గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం సరికాదన్నారు. దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు దళితులను గుడులలోకి ప్రవేశింపచేయాలనీ నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపజేసిన మహనీ యులు పొట్టి శ్రీరాములు అని ఈ సంద ర్భంగా గుర్తు చేశారు. ప్రతేక ఆంధ్ర రాష్ట్రము కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి అని చెప్పారు.అలాంటి జాతీయ నాయకుని పేరు మార్చడం అనేది స్వాతంత్ర సమరయోధులను, జాతీయ నాయకులను అవమానించడమేనని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తెలుగు వారి మనోభావాలు దెబ్బతినకుండా ఈ విషయంలో పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అతని వారసత్వం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజల హృదయాలలో లోతుగా పొందు పరచ బడిందని తెలిపారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పేరు మార్చాలని నిర్ణయాన్ని పున పరి శీలించాలని కోరారు. సురవరం ప్రతా పరెడ్డి తెలుగు సాహిత్యం జర్న లిజానికి ఆయన చేసిన కృషికి ఎంతో గౌర వం ఇస్తూనే ఆయనను సన్మానించడం తో మరొక విశిష్ట వ్యక్తి వారసత్వాన్ని తుడిచిపెట్టే పనికి రాకూడదని మేము విశ్వసిస్తున్నామని అన్నారు. సూరవ రం ప్రతాపరెడ్డి తెలంగాణ బిడ్డల గుండె ల్లో నిలవాలంటే ప్రతేక తెలంగాణ ఉద్యమా నికి ప్రాణం పోసిన ఉస్మానియా యూని వర్సిటీ కి అతని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కాబట్టి అలాంటి నిజాం పేరు మార్చి సురవరం పెట్టాలనీ కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆస్తిత్వానికి ప్రతీకలైన జిల్లాల పేర్ల మార్పుపై ప్రస్త ప్రస్తావించా..
తెలంగాణ ప్రజల ఆకాంక్ష, ఆస్తిత్వానికి ప్రతీకలైన జిల్లాల పేర్ల మార్పు పై నేను అసెంబ్లీలో ప్రస్థావించినట్లుగా అర్బన్ ఎమ్మెల్యే చెప్పారు. హైదరాబాద్ ను భాగ్యనగర్ గా నిజామాబాదును ఇందూ ర్ గా.ఆదిలాబాద్ ను ఎదులాపురం గా, మహబూబ్ నగర్ ను పాలమూరు గా ,మహబూబాబాద్ ను మానుకోట గా వరంగల్ ను ఓరుగల్లు గా జిల్లాల పేర్ల మార్పు పై కూడా వెంటనే మంత్రిమండలి సమావేశమై ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.తెలంగాణ బిడ్డవైతే.. ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టు.ముఖ్యమంత్రి రేవంత్ నిజంగా తెలంగాణ బిడ్డవైతే, నీకు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతా పరెడ్డి పేరు పెట్టాలని అర్బన్ ఎమ్మె ల్యే సవాల్ విసిరారు.దమ్ముంటే హైదరాబాద్ కు భాగ్యనగర్ పేరు పెట్టు…దమ్ముంటే మా నిజామాబాదుకు ఇందూ ర్ పేరు పెట్టు……… ఇవేవి నీకు చేత కావు ఎందుకంటే నిజాం వారసులైన ఎంఐఎం పార్టీకి మీరు తోత్తులు…. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనకుండా ఎంఐఎం పార్టీ కాళ్ళ దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినప్పుడే నీ బాగోతం, నీ పార్టీ బాగోతం తెలంగాణ ప్రజలకు అర్ధం అయింద నారు.ఇప్పటికైనా తెలంగాణ బిడ్డగా అలోచించి ప్రజాబిష్టాలను, ఇచ్చిన గ్యారంటీలను, హామీలను నెరవేర్చే విదంగా పాలనకొనసాగించాలని డిమాం డ్ చేశారు.ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా నాయకులు,కార్పొరేటర్లు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..