ఆదివాసి కమ్యూనిటీ హాల్ కోసం ఉంచిన భూమిలో ఇతర వ్యక్తులు పాగా

 

తీవ్రంగా ఖండిస్తున్న ఆదివాసి సంఘాలు

 

మా దేవుల్లు విగ్రహాల ముందు ఇలాంటి చర్యలు చేయడం మా అంతరాత్మను పరీక్షించినట్టే ఉంటుంది

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట ఎమ్మార్వో ఆఫీస్ పక్కన కొమరం భీం విగ్రహం ఎదురుంగా ఉన్న ఖాళీ స్థలంలో మందనపల్లికి చెందిన కొందరు వ్యక్తులు (అజీమ్ అండ్ టీం) సేవా సంస్థ అని అని చెప్పి ఆక్రమించారు,అట్టి చర్యను తీవ్రంగా ఖండిస్తున్న ఆదివాసీ సంఘాలు, ఇలాంటి చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతాం అంటున్న ఆదివాసి సంఘాలు,తక్షణమే ఇక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలికి గుడారాన్ని పీకేయాలని లేకపోతే రేపు సంఘాల తరఫున ధర్నా చేయాల్సి వస్తుందని ఆదివాసీలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

 

రేపు ఉదయం 9 గంటలకి ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో మహాధర్న కలదు

Join WhatsApp

Join Now