ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడమే మా లక్ష్యం
– ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి.
ఏలూరు, నవంబరు 15:
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు శాంతినగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు నుండి అర్జీలు స్వీకరించారు. తనకు చట్టసభలో అడుగుపెట్టే అవకాశం కల్పించిన పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్దే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్నట్లు ఎంపీ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. పార్లమెంట్ పరిధిలోని ప్రతి మండలంలో నెలకొన్న సమస్యలతో కూడిన జాబితా సిద్ధం చేశామని, ప్రాధాన్యత క్రమంలో వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ వెల్లడించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.