కార్పొరేషన్ పై కాషాయ జండ ఎగురావేయడమే మా లక్ష్యం..

కార్పొరేషన్ పై కాషాయ జండ ఎగురావేయడమే మా లక్ష్యం..

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి జనవరి 11

భారతీయ జనతా పార్టీ నూతన మండల అధ్యక్షులుగా ఎన్నికైన వారికీ ఎంపీ అరవింద్ నివాసంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నియామక పత్రాలు అందజేయడం జరిగింది.

ఈ సందర్బంగా నూతనంగా ఎన్నుకోబడ్డ మండల అధ్యక్షులు మాట్లాడుతు తమ పైన నమ్మకంతో పార్టీ అదినాయకత్వం అప్పగించిన బాధ్యతలు నిష్పక్షపాతంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.

రాబోయే స్థానిక ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ పై కాషాయ జెండా ఎగురావేయడమే తమ లక్ష్యంగా పని చేస్తామని తెలియజేసారు.

ఈ అవకాశం కల్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో నాగోళ్ళ లక్ష్మీనారాయణ నూతనంగా ఎన్నుకోబడ్డ మండల అధ్యక్షులు నాగరాజు, ఇప్పకాయల కిషోర్, బాలాపురం ఆనంద్ రావు, గడ్డం రాజు, తారక్ వేణు గోపాల్, మెట్టు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment