Site icon PRASHNA AYUDHAM

మాప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మహబూబ్ నగర్ కు మెదక్ నుండి తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

*మాప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మహబూబ్ నగర్ కు మెదక్ నుండి తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు*

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నుండి మెదక్ మండలం,పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మహబూబ్ నగర్ లో జరిగే రైతు పండుగ సందర్భంగా అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. మా ప్రజా ప్రభుత్వం లో రైతులు ఎంతో సంతోషంగా వున్నారని రుణమాఫీ ద్వారా రైతులు రైతు పండుగ చేసుకు న్నట్టున్నారని నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. రెండవ సారి రైతు రుణమాఫీ లో 22,22,067, రైతులకు18 వేల కోట్ల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మెదక్ మండలo,పట్టణ నాయకులు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో రుణమాఫీ పై ఇచ్చిన మాటకు కట్టుబడి వుండి రెండు సార్లు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారని సంతోషం వ్యక్తం చేశారు.బి ఆర్ ఎస్ ప్రభుత్వ ములో లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తే మా ప్రభుత్వం రెండు సార్లు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పరిశ్రమలు సన్నలకు 500ల బోనస్ ఇది రైతుల మీదవున్న ప్రేమని అన్నారు. ఆరు గ్యారెంటీల పధకాలు ప్రజలకు అందేలా అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. కుల గుణన ద్వారా ఉపాధి అవకాశాలు స్వయం ఉపాధి కల్పన పొందవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షుడు పబ్బత్తి ప్రభాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజొద్దిన్ మోల్ సాబ్,కాంగ్రెస్ నాయకులు చౌదరి శ్రీనివాస్ రావు,కాంగ్రెస్ పార్టీ మెదక్ మండల అధ్యక్షుడు పేరూరు శంకర్,ర్యాలమడగు మాజీ సర్పంచ్ బోయిని ఆంజనేయులు,ఏర్పుల విజయ్,బాబు,పాతూర్ సిద్దయ్య,మొండి పద్మారావు, పోశయ్య,నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివెళ్లారు.

Exit mobile version