మన ఆరోగ్యం.. మన చేతుల్లో ఉంది: తెలంగాణ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూన వేణు

సంగారెడ్డి, నవంబరు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యంగా ఉంటే మనతోనే సంపద ఉంటుందని, ఆరోగ్యమే మహాభాగ్యం అని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలంగాణ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కూన వేణు అన్నారు. ఆదివారం ఉదయం పూట వాకింగ్ వాకర్స్ తో కలిసి వాకింగ్ వల్ల లాభాల గురించి వివరించారు. ప్రతి రోజు ఒక గంట మనం నడకతో ప్రారంభించాలని, నడక వల్ల మనకున్నటువంటి రోగాలన్నీ చెమట రూపంలో బయటకు పోతుందని, దీంతో మనము మంచి ఆరోగ్యవంతులం అవుతామని సూచించారు. ఈ సందర్భంగా 79 వయస్సు గల మాణయ్యను, పలువురిని వాకింగ్ చేస్తున్న వారిని అభినందించారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ప్రతిరోజు వాకింగ్ చేసి రోగాలను దరిచేరకుండా చూసుకోవాలని కూన వేణు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment