చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే: హైకోర్టు

చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే: హైకోర్టు

హైదరాబాద్ లోని చెరువుల FTL, బఫర్‌జోన్లను రాష్ట్ర సర్కారు నిర్ధారించే వరకు వాటిపై పూర్తి పర్యవేక్షణ తమదేనని హైకోర్టు స్పష్టం చేసింది. HMDA పరిధిలో 3,532 చెరువులున్నాయని, 2,793 చెరువులకు ప్రైమరీ నోటిఫికేషన్లు, 530 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్లు పూర్తయినట్లు ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. నోటిఫికేషన్ల ఖరారుకు 3 నెలల గడువు కోరింది. కాగా, గడువు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు.. DEC 30లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment