మన మందం మన పంట

*మన మందం మన పంట*

*జిఎన్ఎన్ఎస్,కెవికె ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం*

*ఇల్లందకుంట జనవరి 11 ప్రశ్న ఆయుధం*

గ్రామ నవ నిర్మణ్ సమితి, కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు లో భాగంగా “మన ఇంటి మందం మన పంట”ప్రకృతి వ్యవసాయం అనే సంకల్పంతో రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతిలో లభించే వాటితో తయారు చేసినటువంటి సహజ వనరులతో వ్యవసాయం చేయాలని ముఖ్య ఉద్దేశంతో మన ఆరోగ్యాలను కాపాడాలని మన ముందు తరాలకు మనం చరిత్రగా మిగలాలని దీని ఇందులో భాగంగా శనివారం ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామంలో దరువుల కనకయ్య అనే రైతు ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయంలో భాగమైనాడు. దీనిలో భాగంగా ఎకరం వ్యవసాయ భూమిలో జీవామృతం ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, పప్పులపిండి, రసాయనాలు కలపని మట్టి లేదా పుట్ట మట్టి తయారు చేయించి తన ఎకరం భూమికి పారించడం జరిగిందని దీనివల్ల భూమిలో ఉన్న పాజిటివ్ సూక్ష్మజీవులన్నీ భూమి పైకి వచ్చి భూమి యొక్క సాంద్రతనీ పెంచి పంట ఏపుగా ఎదిగేలా సహాయపడుతుంది దీనివల్ల మనకు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కుమారస్వామి , ఫీల్డ్ స్టాఫ్ అజయ్ బొమ్మిదేని , అకేంద్ర, మమత, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment