Site icon PRASHNA AYUDHAM

అదుపుతప్పుతున్న లా అండ్ ఆర్డర్.

విజయవాడలో అదుపుతప్పుతున్న లా అండ్ ఆర్డర్.

విజయవాడ పాతబస్తీ వించిపేటలో సైకో హల్చల్ 

 

పాతబస్తీ పంజా సెంటర్‌కి సమీపంలో నైజాం గేట్ సెంటర్లో ఓ సైకో స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తూ అలజడి సృష్టించాడు.వించి పేటలో టిఫిన్ బండి నడుపుకునే స్థానిక మహిళ సరుకుల కోసం షాప్‌కి వస్తే.. ఒక్కసారిగా ఆ మహిళ పై పడి దాడి చెయ్యబోయడు.వెంటనే ఆ మహిళ భయంతో పరుగులు తీస్తుంటే అది గమనించిన స్థానికులు దుండగుడిని పట్టుకొని ప్రక్కనే ఉన్న స్తంబానికి కట్టి దేహశుద్ధి చేశారు.ఇదే గ్రూప్‌కి సంబందించిన మరొక వ్యక్తి అర్దరాత్రి 2 గంటలకు అసిఫ్ అనే స్థానికుని పై అతి కిరతకంగా దాడి చేశాడు. పెద్దగా శబ్దమ్ వచ్చి ప్రక్కనే ఉన్న ఇళ్లలో నుండి మనుషులు రావటంతో అక్కడ నుండి పరారైన దుండగుడు. నివాసితులు వెంటనే గాయాల పాలైన అసిఫ్ ను దగ్గరలో ఉన్న ఒక ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు.నిన్న లోకో పైలెట్ హత్య జరిగి 24 గంటలు గడవక ముందే వెంట, వెంటనే రెండు సంఘటనలు జరగటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు…

Exit mobile version