ఒత్తిడి, పరీక్షల భయాన్ని అధిగమించండి
ప్రేరణాత్మక కార్యక్రమంలో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్
ఆర్జీయూకేటీ బాసర శాతవాహన గ్రౌండ్లో పియుసి విద్యార్థులకు ఒత్తిడి పరీక్షల భయాన్ని అధిగమించడం ఎలా అనే అంశంపై వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రేరణాత్మక అవగాహన కార్యక్రమాన్ని పాల్గొని ప్రసంగించారు. వైశాన్సర్ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ తన స్వీయ జీవితానుభవాన్ని తెలిపారు. విద్యార్థులు తమ రాబోయే పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు, ఒత్తిడి మరియు భయంగా భావించడం సర్వసాధారణం. ఒత్తిడి ప్రతికూల ప్రభావితం చేస్తుందని భావిస్తూ ఉంటారు. విద్యార్థులు తమకు తాముగా ఒక అధ్యయన ప్రణాళికను రూపొందించుకోవాలి. స్టడీ మెటీరియల్‌ని నిర్వహించదగిన భాగాలుగా విడదీసి, ఒక్కో అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. సానుకూల దృక్పథంతో దేన్నైనా సాధించగలమనీ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ఒత్తిడి మరియు ఆందోళన గురించి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఉపాధ్యాయులతో మాట్లాడండి. వారు విలువైన సలహాలు, మద్దతును అందిస్తారని తెలిపారు. విద్యార్థులు తమ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు పరీక్ష భయాన్ని అధిగమించవచ్చు. పరీక్షల సమయంలో కొంత స్థాయి ఒత్తిడిని అనుభవించడం సాధారణం, కానీ సరైన ఆలోచనా విధానం మరియు వ్యూహాలతో ముందుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో రణధీర్ సాగి, అసోసియేటెడ్ డీన్స్ డాక్టర్ విట్టల్, డాక్టర్ మహేష్, డాక్టర్ చంద్రశేఖర్, చీఫ్ వార్డెన్ శ్రీధర్, డాక్టర్ రాములు పిఆర్ఓ డాక్టర్ విజయ్ కుమార్, భావుసింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.