బీఆర్ఎస్ నేతలకు ఒవైసీ వార్నింగ్..

బీఆర్ఎస్
Headlines :
బీఆర్ఎస్ నేతలకు ఒవైసీ వార్నింగ్ – మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పై సంచలన వ్యాఖ్యలు
హైద్రాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం నవంబర్ 02:

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ఎంఐఎం లోక్ సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టును అడ్డుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ నేతలపై మండి పడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, అసలు మూసీ నది కోసం ఆ పార్టీ చేసింది శూన్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ఆ పార్టీ నేతలు మూసీ ప్రక్షాలను అడ్డు పడకుండా మంచిదని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల అందరి జాతకాలు తమ వద్ద ఉన్నాయని తెలిపిన ఒవైసీ.. తాము గనుక నోరు విప్పితే వారు తట్టుకోలేరని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా ప్రజల్లో అపోహలు రేకెత్తించి వారిని భయాందోళనకు గురి చేయకుండా ఉంటే మంచిదని హితవు పలికారు.

Join WhatsApp

Join Now