సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా టీజీఈజేఏసీ కో చైర్మన్ గా పి.ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు టీజీఈజేఏసీ చైర్మన్ జావీడ్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు.. టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు టీటీయూ జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కార కోసం నిరంతరంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పెండింగ్ లో ఉన్నా 5డిఏలు వెంటనే విడుదల చేయాలనీ, పీఆర్సీ వెంటనే అమలు చేయాలనీ, జీ పీఎఫ్ పెండింగ్ నిధులను విడుదల చేయాలనీ, ఇతర పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
*ప్రసాద్ ఎన్నిక పట్ల హర్షం.*
టీజీఈజేఏసీ కో చైర్మన్ గా ప్రసాద్ ఎన్నిక పట్ల టీటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రవికుమార్, జిల్లా సహ అధ్యక్షుడు శంకర్, బట్టు నరసింహరాజు, జిల్లా ఉపాధ్యక్షులు రాములు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.