ఆల్విన్ కాలనీ డివిజన్ లో  పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ పాదయాత్ర 

ఆల్విన్ కాలనీ డివిజన్ లో

పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ పాదయాత్ర

ప్రశ్న ఆయుధం ఆగస్టు 07: కూకట్‌పల్లి ప్రతినిధి

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పిలుపుమేరకు వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా నిరోధించేందుకు చేపట్టిన వర్షాకాల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమానికి (శానిటేషన్ మాన్‌సూన్ స్పెషల్ డ్రైవ్‌) శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు కూకట్పల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గంగాధర్ తో కలిసి ఆల్విన్ కాలనీ డివిజన్ మొత్తం పాదయాత్ర చేస్తూ తనిఖీలు చేసి పారిశుద్ధ్య పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్‌లు, యాంటీ-లార్వా స్ప్రేయింగ్ ఆపరేషన్‌లు, సీజనల్ డిసీజ్ నివారణ అంశాలు క్షేత్ర స్థాయిలో అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ నిర్వహించాలని అన్నారు. పారిశుధ్య పనులు మరియు దోమల వృద్ధిని అరికట్టేందుకు డ్రై డే కార్యక్రమాలను ముమ్మరంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎల్లమ్మబండ ప్రధాన రహదారి అయిన ఉషముళ్ళపూడి రోడ్డు విస్తరణ పనులు కూడా వేగవంతం చేయాలని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల భద్రత పెంపొందించడంలో భాగంగా రోడ్ సేఫ్టీ డ్రైవ్‌ను కూడా జీహెచ్ఎంసీ నిర్వహిస్తుందని తెలియచేసారు. ప్రజలు కూడా జి.ఎచ్.ఎం.సి సిబ్బందికి సహకరించి చెత్తను వీధుల్లోనూ కాలువలోను వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. రోగాలు ప్రబలకుండా ముఖ్యంగా పిల్లలు పరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకునే విధంగా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియచేసారు. తడిగా ఉన్న కరెంట్ స్తంబాలలో విద్యుత్ ప్రవహించి షాక్ కొట్టే ప్రమాదం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలని తెలియచేసారు.

కార్యక్రమంలో జి.ఎచ్.ఎం.సి అధికారులు ఇ.ఇ గోవర్ధన్ గౌడ్, ఎ.ఎం.ఒ.ఎచ్ శ్రీనివాస్, ఎ.సి.పి జిషాణ్, యూ.బి.డి మేనేజర్ మనోహర్ రెడ్డి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ దీపాంకర్ పాల్, పి.ఓ రాజశేఖర్, సి.ఓ ముస్తఫా, ఎస్.ఆర్.పి ఎ. నాగేశ్వర నాయక్, డి.ఇ రమేష్, ఇంజినీరింగ్ విభాగం ఎ.ఇ శ్రావణి, ఎంటమాలజి ఎ.ఇ తేజ శ్రీ, ఎంటమాలజి సూపర్వైజర్ డి.నరసింహులు, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, యూ.బి.డి సూపర్వైజర్ నాగ రాణి, టి.పీ.ఎస్ మధు, ఎన్.ఎ.సి విశ్వనాథ్, జి.ఎచ్.ఎం.సి విభాగాల సిబ్బంది,

నాయకులు జిల్లా గణేష్, కృష్ణారావు, కట్టా శ్రీనివాస్, బి.వెంకటేష్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, గోపాల్, లింగం, సుధాకర్, సత్తయ్య, వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment