Site icon PRASHNA AYUDHAM

కల్తీ కల్లు తాగి మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.

IMG 20250711 WA0053

సాయి చరణ్ కాలనీలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.

ప్రశ్న ఆయుధం జులై11: న్యాయం న్యూస్

ఈ సందర్భంగా పిఎసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కల్తీ కల్లు తాగి మరణించడం చాలా బాధాకరమైన విషయం అని, బాధాతప్త హృదయం తో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుంది అని,రాజకీయ నాయకులు ఎవరైనా బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి తప్ప రాజకీయాలు చేయొద్దు అని,వారికి బాసటగా నిలవాలని చేయుతనదించాలని ,కల్తీ కళ్ళు ఘటనలో రాందేవ్ రావ్ ఆసుపత్రిలో చేరిన వారందరినీ మెరుగైన వైద్యం కోసం నిమ్స్ మరియు గాంధీ ఆసుపత్రులకు తరలించాము అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు.అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు బాధితుల ఆరోగ్య పరిస్థితి వివరాలను సేకరిస్తున్నాము అని, కల్తీ కల్లు తాగి మృతి చెందిన కుటుంబాలకు కారణమైన అటువంటి కల్లు దుకాణలను సీజ్ చేయించాము అని, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అని, మళ్లీ కాలనీల మధ్య కల్లు దుకాణాలు ఓపెన్ చేస్తే వాళ్లతో రాళ్లతో కొట్టి చంపిన తప్పులేదు అని, పేద ప్రజల జీవితాలతో ఆడుకునేవారిని ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ కల్తీ వ్యాపారాలు చేసే ఎవరికైనా కఠిన చర్యలు తీసుకోవాలి అని,ఎక్సైజ్ అధికారులు, ఆరోగ్యశాఖ మంత్రి, ప్రభుత్వాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ బాధితులకు మెరుగైన వైద్యం అందే విధంగా కృషి చేస్తున్నాం అని, బాధిత కుటుంబాలకు ఆర్ధిక సహాయం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి బాధితులకు అండగా నిలిచే విధంగా కృషి చేస్తానని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు.

కల్తీ కల్లు ఘటన జరగడం చాలా బాధాకరం అని , ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారు ఎంతటి వారైన కఠిన చర్యలు తీసుకుంటామని, ఘటన పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశిస్తూన్నాను అని పిఎసి చైర్మన్ గాంధీ అన్నారు.

బాధితులకు మెరుగైన వైద్యం ప్రభుత్వం తరపున అందిస్తామని, అన్ని విధాలుగా అండగా ఉంటానాని, ఎవరు అధైర్య పడకూడదని ,ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, అధికారులు అలసత్వం వీడి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని,పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్ల రామ కృష్ణ గౌడ్, పోతుల రాజేందర్, కాశినాథ్ యాదవ్, జోగిపేట్ భాస్కర్, బోయ కిషన్, వెంకట్ నాయక్, లింగం, దర్శన్, సత్యనారాయణ, పద్మారావు,లక్ష్మీ, శివ మరియు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version