ఎల్లమ్మబండ లో ఆశ ఆసుపత్రి ని ప్రారంభించిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ప్రశ్న ఆయుధం జులై14: కూకట్‌పల్లి ప్రతినిధి
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆశ ఆసుపత్రి ని కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.
ఈ సందర్భంగా పిఎసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పేద మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ఎల్లమ్మబండ ప్రాంతంలో అన్ని రకాల వసతులతో ,అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో ఆసుపత్రి ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని , సరసమైన ధరలతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో నాయకులు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, బోయాకిషన్, జిల్లా గణేష్, పోశెట్టిగౌడ్, మహేష్, గోపాల్, లింగం, ఆదర్శ్, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.