ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 27(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన మొనగారి మల్లేశం అకస్మాత్తుగా మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న మండల పి ఏ సి ఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మల్లేశం అంత్యక్రియల నిమిత్తం ఐదు వేల రూపాయలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.