Site icon PRASHNA AYUDHAM

ఘనంగా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు

IMG 20250822 WA0038

ఘనంగా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు

-రాజేశ్వరి ఫౌండేషన్ అనాధ వృద్ధాశ్రమంలో ఆకాంక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామారావు ఆధ్వర్యంలో భోజనం,పండ్లు,స్వీట్స్ పంపిణీ, వృద్ధులకు అందజేసిన కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య.

ప్రశ్న ఆయుధం ఆగస్టు 22: కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్పల్లి నియోజకవర్గం అల్విన్ కాలనీ పరిధిలోని రాజేశ్వరి ఫౌండేషన్ అనాధ వృద్ధాశ్రమంలో పద్మ భూషణ్ మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు అక్షయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామారావు,కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ఘనంగా నిర్వహించారు. అనంతరం వృద్ధులకు అన్న సమారాధన భోజన కార్యక్రమం, పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు యాకయ్య మాట్లాడుతూ సినిమా, సమాజం, ప్రజా జీవన రంగాలలో విశిష్టమైన సేవలు గర్వకారణమే కాకుండా స్ఫూర్తిదాయకంగా నిలిచాయని అన్నారు. ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవలు, అందించిన వినోదం ఎప్పటికీ మరిచిపోలేనిదని కొనియాడారు. అలాగే రాజకీయ రంగం నుంచి పలువురు నేతలు కూడా చిరంజీవి సేవాభావం, ప్రజల పట్ల ఆయన చూపిన మమకారం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. చిరంజీవి ఆయురారోగ్యాలతో భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు, మురళి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version